అమెరికన్ ఎక్స్ప్రెస్ పై ఆర్బీఐ కొరడా
రెండు అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆంక్షలు విధించింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు మే 1వ తేదీ నుంచి కొత్తగా దేశీయ ఖాతాదారులను ఎవరినీ కార్డ్ నెట్వర్క్ లో చేర్చుకోవద్దని ఆదేశించింది. ఈ రెండు సంస్థలు డేటా స్టోరేజీ నిబంధనలు అతిక్రమించినందున ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. తాజా చర్యతో ఈ రెండు కంపెనీల ప్రస్తుత ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇలాంటి ఆపరేటర్లు తమ ఖాతాదారుల ఆర్థిక లావాదేవీల విరాలను ఆరు నెలల్లోపు దేశంలోని సర్వర్లతోనే స్టోర్ చేసి, ఆ విషయాన్ని ఆర్బీఐకి సరైన ధ్రువీకరణతో తెలపాల్సి ఉంటుంది. ఈ విషయంలో రెండు కంపెనీలు విఫలమవడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది.






