ప్రియాంకా గాంధీకి రాహుల్ ఛాలెంజ్!

వయనాడ్ ఉప ఎన్నికకు సమయం సమీపిస్తోంది. మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా గెలుపు కోసం రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తన సోదరికి ఓ సవాల్ విసిరారు. వయనాడ్‌ను ఉత్తమ పర్యటక ప్రదేశంగా మార్చాలని రాహుల్ ఆమెకు ఛాలెంజ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా వయనాడ్‌కు నా హృదయంలో గొప్ప స్థానం ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రాంత అందాలను ప్రపంచానికి చూపిచాలి. ఉత్తమ పర్యటక ప్రదేశంగా మర్చాడానికి ప్రియాంక కృషి చేయాలి. ఎవరైన కేరళ వస్తే మొదట ఈ ప్రాంతమే గుర్తు రావాలి. కాబోయే ఎంపీ ఇది ఛాలెంజ్‌గా తీసుకోవాలి. ఈ ప్రాంతానికి మంచి జరిగితే అది నాకెంతో సంతోషానిస్తుంది అని రాహుల్ పేర్కొన్నారు.