దీపావళి వేడుకల్లో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన మేనల్లుడు రేహాన్ వాద్రా కళాకారుల వద్దకు వెళ్లి వారితో కలిసి దీపావళి నిర్వహించుకున్నారు. వారితో పాటు ప్రమిదలు, కుండలు తయారు చేశారు. అంతే కాకుండా వారితో కలిసి ఓ నివాసానికి రంగులు వేసి వారి వద్ద పెయింటింగ్‌లో మెలకువలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పంచుకుంటూ భారతదేశానికి ప్రశావంతం చేసే వారితో దీపావళి అంటూ రాసుకొచ్చారు. ఈ కళాకారులు తయారు చేసే మట్టి ప్రమిదలు ఎప్పటికైనా ప్రపంచంలోని విలువైన సెరామిక్‌తో చేసిన వస్తువులతో పోటీ పడొచ్చు అని రాహుల్ తన మేనల్లుడు రేహాన్‌కు చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను వివరించారు. ఈ కార్మికులు ప్రతి ఒక్కరి దీపావళిని సంతోషకరమైనదిగా చేస్తారని, ఈ పండగ వీరందరి జీవితాల్లో శ్రేయస్సు పురోగతి, అభివృద్ధి తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.