మా వెడ్డింగ్ సీఈఓ మా అత్తయ్యే : రాధిక మర్చంట్

ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ వివాహం రాధికా మర్చంట్ తో జరిగింది. కొన్ని నెలల కాలంలో పలుమార్లు నిర్వహించిన వివాహ ముందస్తు వేడుకల్లో అంబానీ కుటుంబసభ్యుల దుస్తులు, నగలు అందరినీ ఆకర్షించాయి. అలాగే అతిథుల కోసం చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యపరిచాయి. ఈ పెళ్లి ఇంత ఘనంగా జరగడం వెనక నీతా అంబానీదే కీలకపాత్ర. ఈ విషయాన్ని ఆమె చిన్నకోడలు రాధికనే స్వయంగా వెల్లడించారు. మా వెడ్డింగ్ సీఈఓ మా అత్తయ్చే. ఆమె దార్శనికత, నిబద్ధతే వేడుకలు ఘనంగా జరిగేందుకు కారణమయ్యాయి. అలాగే ఆమెకు తన వదిన ఈశా అంబానీ, తోటికోడలు శ్లోకా మెహతా ఎంతగానో సహకరించారు. ఇందుకోసం వెడ్డింగ్ ప్లానర్స్, మరికొంతమంది సిబ్బందిని నియమించారు. వారంతా నిర్విరామంగా పనిచేశారు. మా ఇద్దరి జాతకాల ఆధారంగా మా పూజారి వెడ్డింగ్ తేదీలను నిర్ణయించారు అని ఆమె తెలిపారు.