వయనాడ్‌లో రేపు ప్రియాంక నామినేషన్

కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రం కాల్పేటలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు ఉంటారు.