అర్జున్‌కు ప్రధాని మోదీ అభినందన

లైవ్ చెస్ ఎలో రేటింగ్‌లో 2800 మార్క్ అందుకున్న తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అర్జున్ అద్భుతమైన ఘనతను సాధించావు. నిన్ను చూసి దేశం గర్వపడుతోంది. నీ ప్రదర్శన మరింత మంది యువత చెస్ ఆడేందుకు ప్రేరణగా నిలుస్తుంది అని మోదీ పేర్కొన్నారు.