Air India: ఎయిరిండియా విమాన ప్రమాదం … కేంద్రానికి ప్రాథమిక నివేదిక

అహ్మదాబాద్ (Ahmedabad) లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటన పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు జరిపిన విశ్లేషణ, దర్యాప్తు ఆధారంగా ఏఏఐబీ (AAIB ) ప్రాథమిక నివేదిక రూపొందించింది. దాన్ని కేంద్ర పౌరవిమాన మంత్రిత్వశాఖతో పాటు సంబంధిత ఇతర అధికారులకు సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడిరచాయి. ప్రస్తుతానికి ఈ నివేదికను అధికారులు (Officials) బయటపెట్టలేదు. ఈ వారాంతంలో విడుదల చేసే అవకాశమున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. విమాన డేటా, చివరి నిమిషంలో సిబ్బంది చర్యలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలతో ఈ ప్రాథమిక నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికతో ప్రమాదానికి గల కారణాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.