Amit Shah: వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : అమిత్ షా

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడి (Terrorist attack) ని ప్రధాని మోదీ (Prime Minister Modi) తీవ్రంగా ఖండిరచారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో ఫోన్‌లో మాట్లాడారు. దాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించిన ప్రధాని, తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించాలని చెప్పారు. పర్యాటకుల (Tourists)పై దాడి తీవ్రంగా బాధించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించాను. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్ వెళ్తున్నాను అని తెలిపారు.