దేశ రక్షణ రంగ తయారీలో.. కీలక ఘట్టం

దేశ రక్షణ రంగ తయారీలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని వడోదరలో సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం నిర్మించిన దేశంలోనే తొలి ప్రైవేటు కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ పరిశ్రమ భారత్` స్పెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం సహా మేకిన్ ఇండియా, మేక్‌ఫర్ ది వరల్డ్ మిషన్‌ను బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండేళ్లలో తొలి విమానాన్ని సైన్యానికి అందిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.