ఆర్ బీఐ పై ప్రధాని మోదీ ప్రశంసలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. గడిచిన 10 ఏళ్ల బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంలో ఆర్‌బీఐ కీలక భూమిక పోషించిందని కొనియడారు. నాడు దిక్కుతోచని స్థితిలో ఉన్న బ్యాంకులు ఇవాళ లాభాల పట్టాయి. ఈ 10 ఏళ్లలో ఈ మార్పులు అంత సులువుగా ఏమీ జరగలేదు. మా ప్రభుత్వం, ఆర్‌బీఐ అనుసరించిన విధానాలే అందుకు కారణం. బ్యాకింగ్ వ్యవస్థ బాగు విషయంలో మా ఉద్దేశాలు స్పష్టంగా ఉండడంతో ఇవాళ ఈ పరిస్థితి సాధ్యమైంది. భవిష్యత్‌లోనూ ఆర్‌బీఐ భిన్నంగా ఆలోచించాలి.
ఇందులో గవర్నర్ శక్తికాంత్ దాస్‌ది అందివేసిన చేయి అని మోదీ కొనియాడారు. రాబోయే పదేళ్లలో దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే ఇతర దేశాల ప్రభావం మనపై పడదన్నారు. మూడోసారి తాము అధికారంలోకి వచ్చిక ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. ఈ పదేళ్లలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, భారత్‌ను ముందుకు తీసుకెళ్లడంలో చేయాల్సింది ఇంకా చాలా ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ గవర్నర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.