Narendra Modi : మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా : ప్రధాని మోదీ

ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు (Maoists) మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి, ప్రజలకు శాంతి, పురోగతిని కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మోదీ పేర్కొన్నారు.
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (Nambala Kesava Rao) (70) అలియాస్ బసవరాజు (Basavaraj) మృతి చెందినట్లు అమిత్ షా (Amit Shah) వెల్లడిరచిన సంగతి తెలిసిందే. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని అన్నారు.