Vijay Rupani: విజయ్ రూపాణీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోదీ

అహ్మదాబాద్ నుంచి లండన్ (London) కు బయలుదేరిన ఎయిరిండియా (Air India) విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణలు కోల్పోయిన బీజేపీ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌రూపాణీ (Vijay Rupani) కుటుంబసభ్యులను ప్రధాని పరామర్శించారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ఎయిరిండియా విమాన ప్రమాద సమయంలో అందులో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు.