ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించిన మోదీ

పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా ఈ పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన యూ`విన్ పోర్టల్‌ను ఈ సందర్భంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అంచనా.