Draupadi Murmu: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ

పాక్‌పై ప్రతీకార చర్యల వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu ) తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న మోదీ, ముర్ముతో సమావేశమయ్యారు. పాకిస్థాన్ (Pakistan) , పాక్ ఆక్రమిత కశ్మీర్ (Kashmir) లో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి వివరించారు. సరిహద్దు వద్ద తాజా పరిస్థితి, ప్రభుత్వ చర్యలకు రాష్ట్రపతి ముర్ముకు వివరించారు.