చిన్నారి తీరాకు రూ.16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్..

అత్యంత అరుదైన వ్యాధిలో బాధపడుతున్న ఓ ఐదు నెలల చిన్నారి తీరా కామత్ కు ముంబై హిందుజా ఆస్పత్రి వైద్యులు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరస్థితి బాగుందని డాక్టర్లు వెల్లడించారు. ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన మిహర్ కామత్, ప్రియాంక కామత్‍ల కుమార్తె తీరా కి వెన్నెముక కండరాల సమస్య స్పైనల్ మస్య్కులర్ అట్రోఫీ అనే జన్యుపరమైన లోపం తలెత్తింది. అనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స కోసం ముంబై హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారికి అత్యంత జన్యుపరమైన లోపం తలెత్తిందని, ట్రీట్మెంట్ కోసం రూ.16 కోట్ల విలువ చేసే ఒక ఇంజక్షన్ జోల్‍జెన్‍స్మాను వేయాల్సి ఉంటుందని అన్నారు.
ఈ ఇంజక్షన్ అమెరికా నుండి ఇండియాకు తీసుకొని రావాల్సి ఉంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఏం చేయాలో తేలియక దేవుడిపై భారం వేశారు. ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆన్‍లైన్‍లో విరాళాన్ని సేకరించారు. కేవలం 42 రోజుల్లో ప్రపంచ దేశాలకు చెందిన 2.6 లక్షల మంది విరాళంగా అందించడంతో ముంబై హిందుజా ఆస్పత్రి వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన జోల్ జెస్ స్మా ఇంజక్షన్ వేశారు.