కేంద్రమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కృష్ణమీనన్ మార్గ్‌లోని హోం మంత్రి అధికార నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇది మర్యాదపూర్వక భేటీయేనని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటివరకూ నేను ఢిల్లీకి రాలేదు. అమిత్ షాతో ఇది తొలి సమావేశం. మర్యాదపూర్వకంగానే కలిశా. రాజకీయ ప్రాధాన్యం లేదు అని తెలిపారు.