Pawan Kalyan: శ్రీ ఆదికుంభేశ్వరుణ్ని దర్శించుకున్న పవన్ కల్యాణ్

దక్షిణ భారతదేశంలోని ఆలయాల పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తమిళనాడు (Tamil Nadu) లోని కుంభకోణంలో ఉన్న శ్రీ ఆదికుంభేశ్వ రుణ్ని (Adikumbheswara) దర్శించుకున్నారు. గజరాజుతో కలిసి ఆయన అర్చకులు, అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. ఆదిగణపతి దర్శనం అనంతరం మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పంచహారతులు ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయంలోని మంగళనాయకి (Mangala Nayaki) అమ్మన్‌ను పవన్ దర్శించుకు న్నారు. శ్రీఆదికుంభేశ్వరాలయ ప్రాంగణంలోని అగస్త్య ధ్యానపీఠ మందిరాన్ని సందర్శించారు. ధ్యానమందిర ప్రాధాన్యాన్ని అర్చకులు వివరించారు. స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను అధికారులు పవన్ కల్యాణ్‌కు అందించి సత్కరించారు.