పాన్- ఆధార్ లింక్ తప్పనిసరి లేదంటే…
కేంద్ర ప్రభుత్వం ఆధార్, పాన్ కార్డులను అనుసంధానించడాన్ని తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2021కి కీలక సవరణ చేసి ఆమోదించింది. ఆదాయపు పన్ను చట్టం-1961లో కొత్తగా 234 హెచ్ సెక్షన్‌ను చేర్చింది. దీని ప్రకారం పాన్‌కార్డు ఉన్న వాళ్లంతా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. మార్చి 31 తేదిని గడువుగా విధించింది. అలా చేయని ఎడల జరిమానా విధించాలని నిర్ణయించినప్పటికీ ఎంతా అనేది ఇంకా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పాన్-ఆధార్ లింక్ చేసుకోని ఎడల ఆదాయపు పన్ను దాఖలును కూడా నిరాకరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.






