నేపాలీ మహిళ ప్రపంచ రికార్డు.. 15 గంటల్లోపే

ఎవరెస్ట్ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించి నేపాలీ మహిళా పర్వతారోహకురాలు ఒకరు అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు. గూర్ఖా జిల్లాకు చెందిన పుంజోలామా బుధవారం మధ్యాహ్నం 3:52 గంటలకు బేస్‌క్యాంపు నుంచి పర్వతారోహణను ప్రారంభించారు. గురువారం ఉదయం 6: 23 గంటలకు 8,848 మీటర్ల శిఖరాగ్రానికి చేరుకుని అతితక్కువ సమయంలో (14.31 గంటల్లో) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళళా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు నేపాల్ పర్యాటకశాఖ వర్గాలు తెలిపారు. 2015లో హాంకాంగ్‌కు చెందిన అడా త్సాంగ్ యిన్`హంగ్ అనే మహిళ 25 గంటల 50 నిమిషాల్లో ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు పుంజో లామా ఆ రికార్డును తిరగశారు.