Rajnath Singh : ప్రస్తుతం వ్యవసాయం తో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్య పాత్ర : రాజ్‌నాథ్ సింగ్

కొన్నాళ్లపాటు తాను సైన్స్ అధ్యాపకుడిగా పని చేశానని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడిరచారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా డీఆర్‌డీవో విజ్ఞాన్ భవన్ (DRDO Vigyan Bhavan ) లో నిర్వహించిన ప్రదర్శనకు కేంద్ర రక్షణమంత్రి హాజరై ప్రసంగించారు. నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ (CV Raman) ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారని, ఆయన గౌరవార్థం ఏటా ఈరోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ (Science) ముఖ్యపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. తాను కూడా సైన్స్ విద్యార్థినేనని, కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేసినట్లు పునరుద్ఘాటించారు. సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మానవ పరిణామ క్రమాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. నూతన ఆవిష్కరణలకు భారత్ హబ్ (Bharat Hub )గా రూపొందుతోందని పేర్కొన్నారు. దేశంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని, రక్షణ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొస్తోందని తెలిపారు.