రిలయన్స్ కు భవిష్యత్ లీడర్ లు వీరే…
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో మూడోతరం పాలనా పగ్గాలకు చేపట్టే ప్రక్రియకు ముకేశ్ అంబానీ బాటలు వేశారు. కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో వారసత్వ ప్రణాళికను బయటపెట్టారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే భవిష్యత్ లీడర్లు వీరేనంటూ వారసులు ఆశాశ్, ఈశా, అనంత్ అంబానీల పేర్లను ప్రకటించారు. పెద్ద కుమారుడు ఆకాశ్‌కు జియో బాధ్యతలు అప్పగించగా, కుమార్తె ఈశాకు రిలయన్స్ రిటైల్, చిన్న కుమారుడు అనంత్‌కు న్యూ ఎనర్జీ విభాగాలను అప్పజెప్పారు. అయితే తానేం రిటైర్ అవడం లేదని స్పష్టం చేశారు. మునపటిలాగే కంపెనీ నాయకత్వ బాధ్యతలను కొనసాగిస్తానని వెల్లడించారు.






