రెండు దేశాల మధ్య 500 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ఎంతో కీలకమైనదని ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చైర్మన్ విజయసాయి మేక అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికాల మద్య 500 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం సాధించడమే లక్ష్యంగా ఐఏసీసీ పనిచేస్తోందని తెలిపారు. భారత్, అమెరికాలు సహజ భాగస్వాములని ప్రధాని సరిగ్గా చెప్పారని పేర్కొన్నారు. రక్షణ, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం శాంతి నెలకొల్పడం, వాతావరణ మార్పులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, స్పేస్ సాంకేతికత తదితర అంశాల్లో రెండు దేశాలు ఎప్పటికప్పుడు సహకరించుకుంటున్న విషయాన్ని విజయసాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు.






