వజ్రాల వ్యాపారి ఇంట వేడుకల్లో ప్రధాని మోదీ

గుజరాత్ వజ్రాల వ్యాపారి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు ప్రధాని మోదీ హాజరయ్యారు. దీపావళి సమయంలో తన ఉద్యోగులకు భారీగా కానుకలు ఇచ్చే వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహం ఈ వారం జరిగింది. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆ వేడుకకు హాజరైన మోదీ, వధూవరులను ఆశీర్వదించారు. ద్రవ్య, జాన్వి వివాహ బంధంతో ఒక్కటైన సందర్భంగా ప్రధాని మోదీ హాజరుకావడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం అంటూ సావ్జీ అన్నారు.