Virendra Kumar: కేంద్ర మంత్రి కీలక విజ్ఞప్తి … అలా చేసిన వారికి

ప్రజలకు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ (Virendra Kumar) కీలక విజ్ఞప్తి చేశారు. పాదాలను తాకడంపై నిషేధం ఉందని, అలా చేసిన వారికి పనులు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని తికమ్‌గఢ్ లో గల తన కార్యాలయం వద్ద వినూత్న బోర్డు ఏర్పాటు చేశారు. పాదాలను తాకడంపై నిషేధం ఉంది. అలా చేసిన వారికి ఎటువంటి పనులూ అప్పగించేది లేదు అంటూ పోస్టర్ (Poster) ను ఏర్పాటు చేశారు. ఇది చూసిన స్థానిక ప్రజలు, రాజకీయ నేతలు (Political leaders) షాక్ అవుతున్నారు. కార్యాలయం వద్దకు వచ్చినా వారంతా ఈ బోర్డును ఆసక్తిగా తిలకిస్తున్నారు. కేంద్ర మంత్రి చేసిన ఈ పనిని ప్రశంసిస్తున్నారు.