మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీనామా
మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం మైక్రోసాఫ్ట్‌లో ఉన్నత స్థాయి హోదాల్లోని అధికారుల బాధ్యతల్లో మార్పునకు దారితీసింది. ప్రస్తుతం ముఖ్య ఆపరేటింగ్ అధికారిగా (సీఓఓ) ఉన్న ఇరినా ఘోష్ కు మేనేజింగ్ డైరెక్టరుగా (ఇండియా) పదోన్నతి కల్పించారు. నవ్‌తేజ్ బాల్‌కు సీఓఓ బాధ్యతలు అప్పగించారు. మైక్రోసాఫ్ట్ నుంచి అనంత్ వైదొలిగారనే విషయాన్ని మేం ధ్రువీకరిస్తున్నాం. భారత్‌లోని మా వ్యాపార వృద్ధికి అందించిన కృషికి గాను అనంత్‌కు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు.






