Ahmedabad: విమాన ప్రమాదంలో చాలా మంది మరణించారు : విదేశాంగ శాఖ

గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం (Air India flight) టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో చాలా మంది మరణించినట్లు వెల్లడిరచింది. అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘటన మాటలకందని పెను విషాదం. ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్ ప్రకారం ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు (Foreigners) ఉన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) తెలిపారు. ఘటనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సంబంధిత శాఖకు ఎప్పటికప్పుడు పంచుకుంటాయని పేర్కొన్నారు.