Nara Lokesh: కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో లోకేష్ భేటీ

కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు సహకారం అందించండి
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు అక్కడి ప్రజల చిరకాల కోరిక, కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు సహకరించండి. న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఎపి రాజధానికి రావడానికి 500 కి.మీ.కు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. యువగళం పాదయాత్ర సందర్భంగా సీమ ప్రజలు, న్యాయవాదులు హైకోర్టు బెంచి చేయాలని విన్నవించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన బెంచి ఏర్పాటుకు సహకరించాలి. రాష్ట్రంలోని కోర్టుల్లో జ్యుడిషియరీ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ అభివృద్ధికి సహకారం అందించండి. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని మంత్రి లోకేష్ కేంద్రమంత్రికి అందజేశారు.