2 నుంచి లాక్హీడ్ మార్టిన్ వార్షిక సదస్సు
అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ రక్షణ పరికరాల తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ తమ తొమ్మిదో వార్షిక భారత సరఫరాదారుల సమావేశం వచ్చే నెల రెండు నుంచి మూడు వరకు బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నిర్వహించనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ సొమప్ప బొమ్మై ప్రారంభించనున్న ఈ సదస్సులో కంపెనీకి సంబంధించిన భారతీయ భాగస్వాములు, సరఫరాదారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సరఫరాదారుల ప్రదర్శనలు, లాక్హీడ్ మార్టిన్ సప్లై చెయిన్ ప్రతినిధులు, వ్యాపారాభివృద్ధి బృందం సభ్యులు, బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.






