పిల్లల చదువు కోసం #StandUpForLearningGap పి అండ్ జి చదువు ఉద్యమంలో చేరిన కొంకణా సేన్ శర్మ

నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే 2021 ప్రకారం పిల్లల్లో నేర్చుకునే అంతరాయాల స మస్య దేశంలోని 6 కోట్ల మంది పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో నేర్చుకునే అంత రాయాల సమస్యను గుర్తించేందుకు, P&G ఇండియా ప్రధాన సీఎస్ఆర్ కార్యక్రమం అయిన P&G శిక్షా తన కొత్త ప్రచార కార్యక్రమం – #StandUpForLearningGaps ను ప్రారంభించింది. చదువుకు ప్రాప్యత గణ నీయంగా మెరుగుపడినప్పటికీ, నాణ్యమైన అభ్యాస ఫలితాలు వచ్చేలా చేయడం ఒక సవాలుగా మిగిలి పోయింది.
అభ్యాసన అంతరాలపై ప్రజలకు అవగాహన లేకపోవటం వల్ల తరచూ ఎగతాళి లేదా అపహాస్యం ఎదుర్కొనే పిల్లలపై ఈ అభ్యాస అంతరాల ప్రభావం గురించి ప్యానెల్ చర్చ ప్రముఖంగా చాటిచెప్పింది.
#StandUpForLearningGap అనే థీమ్‌పై కేంద్రీకృతమైన ప్యానల్ చర్చ రచయిత్రి, మాజీ జర్నలిస్ట్ ప్రియాంక ఖన్నాచే నిర్వహించబడింది. ఈ చర్చా కార్యక్రమం విభిన్న వక్తల సమూహాన్ని ఒకచోట చేర్చిం ది: రెండుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న భారతీయ నటి, చిత్రనిర్మాత కొంకణా సేన్ శర్మ, P&G ఇండి యా కేటగిరీ లీడర్ – గ్రూమింగ్, వైస్ ప్రెసిడెంట్ – బ్రాండ్ ఆపరేషన్ అభిషేక్ దేశాయ్, స్టాండ్-అప్ కామిక్ రాహుల్ దువా వీరిలో ఉన్నారు.
లెర్నింగ్ గ్యాప్స్ సమస్య ఉన్న పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్యానెల్ సభ్యలు చర్చించారు. తాము తమ స్వంత అనుభవాలను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే, భారతదేశంలోని పిల్లలందరికీ తోడ్పడేరీతిలో ఉండే అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి అధ్యాపకులు, తల్లిదండ్రులు, సమాజం మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను చర్చించారు. కొంకణా, రాహుల్ కూడా వారి స్వంత అభ్యాస స్థాయి లను గుర్తించడానికి ఒక పరీక్షను తీసుకున్నారు. పిల్లల అవగాహన స్థాయిపై దృష్టి పెట్టడం, బలమైన పునాదిని నిర్మించడం అవసరం.
ఈ కార్యక్రమంలో P&G శిక్షా తన కొత్త ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించింది. ఇది అభ్యసన అంతరాలను గమనించి, ఈ మహత్తర కారణం కోసం నిలబడేలా వీక్షకులను ప్రేరేపిస్తుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సాపేక్ష హాస్యం, స్టాండ్-అప్ సీక్వెన్స్ ని ఉపయోగించిన, ఈ తరహాలో మొదటిదైన చిత్రం.
ఈ చిత్రం ఇటీవల ఇంటర్నెట్‌లో వెల్లువెత్తుతున్న మీమ్‌ల నుండి స్ఫూర్తిని తీసుకుంటుంది – పిల్లలు ఒక ప్రశ్నకు తప్పు సమాధానం ఇస్తే ప్రతిస్పందించడానికి కష్టపడడం లేదా వెక్కిరించడం అందులో కనిపిస్తుంది. నిజానికి, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, 2023లో భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన టాప్ 10 మీమ్‌లలో జర్నలిస్టుకు తప్పుగా సమాధానమిచ్చిన ఒక చిన్నారి వీడియో కూడా ఒకటి.
ఈ విధమైన వెక్కిరింత తరచుగా మరింత తీవ్రమైన సమస్యను కప్పివేస్తుంది: అదేమిటంటే – పిల్లల విద్యా పురోగతికి ఆటంకం కలిగించే సమస్యలపై అవగాహన లేకపోవడం. తమకు అర్థం కాని ప్రశ్న ఎదురైనప్పుడు దానికి సమాధానం ఇచ్చేందుకు వారు కష్టపడవచ్చు లేదా తప్పు సమాధానం ఇస్తే ఎగతాళికి గురి కావచ్చు.
అందువల్ల, ఈ సంవత్సరం, P&G శిక్షా తన ప్రచారం ద్వారా జీవితం-వంటి పరిస్థితిని పునఃసృష్టిస్తోంది. ఇది ప్రేక్షకులను నిమగ్నం చేయడానికి హాస్యం తోడ్పాటు తీసుకుంటుంది. నేర్చుకునే అంతరాయాల సమస్యను గ్రహించడానికి వారికి కొంత విరామం ఇవ్వడంలో సహాయపడుతుంది. ఒకరి వినోదం, మరొకరి సంక్షోభం కావచ్చు! పూర్తిగా తాజా దృక్పథంతో, “స్టాండ్ అప్ ఫర్ లెర్నింగ్ గ్యాప్” అనే ఈ ప్రచారం ఈ సమస్యను పరిష్కరించడానికి మరియు సమిష్టి చర్యను కోరడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా నటి కొంకణా సేన్ శర్మ మాట్లాడుతూ, ‘‘’’ ‘‘పిల్లల పూర్తి సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకు రావడానికి చదువు చాలా అవసరమని నేను నిజంగా నమ్ముతున్నాను. P&G శిక్షాతో నా అనుబంధం ద్వారా నేను, ఊహించిన నేర్చుకునే స్థాయిల కంటే వెనుకబడిన చాలా మంది పిల్లలను ప్రభావితం చేసే అ భ్యాస అంతరాల గురించి ఎంతో తెలుసుకున్నాను. సరైన స్పందనలు తెలియని పిల్లలు అపహాస్యం లేదా నిర్లక్ష్యాన్ని ఎదుర్కోవచ్చు. నేను మొదట ఈ సినిమా చూసినప్పుడు– ఇదే మీ బిడ్డ అయితే మీరు నవ్వు తారా? అనే ఈ ప్రశ్న నాలో కాసేపు ఉండిపోయింది. P&G శిక్షా ఈ అంతరాల గురించి అవగాహన కలిగించ డమే కాకుండా, సమర్థ వంతమైన జోక్యాలతో వాటిని తగ్గించడానికి కృషి చేయడం చూడటం ప్రోత్సాహ కరంగా ఉంది. అవగాహన అనేది చర్యకు మొదటి మెట్టు. P&G శిక్షాతో ఈ ప్రయాణంలో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. మనమంతా కలిసి, సంపూర్ణ విద్య ద్వారా ప్రతి బిడ్డ తమ పూర్తి సామర్థ్యాన్ని చే రుకునేలా ప్రోత్సహించబడే వాతావరణాన్ని మనం సృష్టించవచ్చు. మనమంతా కలిసి, #StandUp ForLearningGap చేద్దాం’’ అని అన్నారు.
ఈ కొత్త చిత్రం గురించి P&G ఇండియా కేటగిరీ లీడర్ – గ్రూమింగ్, వైస్ ప్రెసిడెంట్ – బ్రాండ్ ఆపరేషన్ అభిషేక్ దేశాయ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటికి 19 సంవత్సరాలుగా, P&G శిక్షా భారతదేశంలోని మిలియన్ల మంది నిరుపేద పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచ్చింది. ఇది 45 లక్షల మంది పిల్లలపై ప్రభావం చూ పుతోంది. భారతదేశంలోని 6 కోట్ల మంది పిల్లలపై ప్రభావం చూపే అభ్యాస అంతరాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలనే మా నిబద్ధతతో మేం దీనిని బలోపేతం చేశాం. ఈ అంతరాలు నిరాశకు, అవగాహనా రాహిత్యానికి, ఎగతాళికి కూడా దారితీస్తాయి.
అయితే, ఇందులో తరచుగా మిస్ అయ్యేది దాని వెనుక గల కారణం. సంబంధిత ప్రశ్నను లేవనెత్తడం ద్వారా – “ఇది మీ బిడ్డతో జరిగితే మీరు ఇలాగే నవ్వుతారా?” అని ప్రశ్నిస్తూ, తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు ఈ అభ్యాస అంతరాల ఉనికి, ప్రభావంపై అవగాహన కల్పించాలని మేం కోరుతున్నాం. అదే సమయంలో ఆయా సమస్యలను గుర్తించడానికి మరియు తగు చర్యలు తీసుకో డానికి వారికి మేం సాధికారక కల్పిస్తాం. #StandupForLearningGap కోసం మమనంతా కలిసి పని చేయవచ్చు. సమయానుకూలమైన చర్య ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యను అందించడంలో పిల్లల పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించగలదు’’ అని అన్నారు.
P&G ఇండియా ప్రధాన సీఎస్ఆర్ కార్యక్రమం అయిన P&G శిక్షా 2005 నుండి కూడా నిరుపేద పిల్లలకు చదువును అందించడానికి పని చేస్తోంది, ఇది 45 లక్షల మంది పిల్లలపై ప్రభావం చూపుతోంది.
ఇందులో భాగంగా, పిల్లలలో అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి, P&G శిక్షా ఎడ్యుకేషనల్ ఇన్షి యేటివ్స్ భాగస్వామ్యంతో ‘మైండ్‌స్పార్క్’ అనే కంప్యూటర్ ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ టూల్‌తో ఏఐ ఆధా రిత సాంకేతికతను ప్రభావితం చేస్తుంది. శిక్షణ పొందిన వలంటీర్లు, ఉపాధ్యాయుల మద్దతుతో కమ్యూనిటీ-ఆధారిత, ఇన్-స్కూల్ నమూనాలను ఉపయోగించి, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ క్షేత్రస్థాయిలో అభ్యాస అంతరాలను తగ్గించేందుకు రెమెడియల్ లెర్నింగ్ జోక్యాలను కూడా అమలు చేస్తుంది.
అదనంగా, P&G శిక్షా ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా బాల్య విద్యపై దృష్టి సారిస్తుంది. అభ్యాస అంతరాలను నివారించడానికి పిల్లలలో కదలికలు, అభిజ్ఞా, సామాజిక-భావోద్వేగ, భాష, సృజనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మరియు వారు పాఠశాల విద్య ప్రారంభించినప్పుడు బలమైన పునాది వేయడం చేస్తుంది.
ఈ చిత్రం కామిక్ రాహుల్ దువా స్టాండ్-అప్ నటనతో ప్రారంభమవుతుంది. దీనిలో ఆయన ప్రాథమిక గణిత ప్రశ్నలపై పిల్లలు పొరపాట్లు చేసే మీమ్‌లను ప్రదర్శిస్తాడు. ప్రేక్షకులలో నవ్వులు విర జిమ్ముతుండగా, రాహుల్ తన చిన్ననాటి పోరాటాన్ని ఇలాంటి భావనలతో పంచుకోవడంతో అందరి మూడ్ మారుతుంది.
నేర్చుకునే అంతరాన్ని ఎదుర్కొంటున్న 6 కోట్ల మందికి పైగా పిల్లల దుస్థితిని ఆయన చాటిచెబుతూ, నేర్చుకునేందుకు వారికి కొంత సమయం పడుతుందన్నారు. ఇదే “మీ బిడ్డ అయితే మీరు నవ్వుతారా?” అనే శక్తివంతమైన ప్రశ్నను ఆయన వీక్షకులకు సంధించారు. అభ్యాస అంతరాల వాస్తవికతను మరింత నొక్కిచెబుతూ ఈ చలనచిత్రం ఈ అంతరాలను పరిష్కరించడానికి NGOలతో P&G శిక్షా యొక్క క్షేత్రస్థాయి కార్యకలాపాలను ప్రదర్శిస్తుంది మరియు వీక్షకులకు ఈ అంశంపై పని చేసేందుకు, StandUpForLearningGapకి అధికారం ఇస్తుంది.
సినిమాను ఇక్కడ చూడండి: https://www.youtube.com/watch?v=IZ_p1zoOgxM
*మూలాలు –
- 2021 నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో దాదాపు సగం మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ గ్రేడ్‌లకు తగిన దానికంటే తక్కువ లెర్నింగ్ లెవెల్‌లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. (మూలం: UNICEF, విద్య 4.0)
- జనాభా లెక్కల డేటా 2011లో 5 నుండి 9 సంవత్సరాల మధ్య వయస్సు గల 13 కోట్ల మంది పిల్లలను చూపుతుంది-
https://censusindia.gov.in/census.website/data/data-visualizations/Age-Gender-Ratio_Pyramid-Chart