NDA: 25న ఎన్డీయే నేతల కీలక భేటీ

అధికార ఎన్డీయే కూటమి భాగస్వామ్యపక్షాలు డిసెంబర్ 25న ఢిల్లీలో భేటీ కానున్నాయి. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే (NDA) నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) నివాసంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నట్లు సమాచారం. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల పార్లమెంటులో సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనల, తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఈ కీలక భేటీకి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సహా ఎన్డీయే పక్షాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు.