బిష్ణోయ్ ఎన్‌కౌంటర్‌కు కోటి రివార్డు

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఎన్‌కౌంటర్‌కు కర్ణిసేన రూ.1,11,11,111 రివార్డును ప్రకటించింది. బిష్ణోయ్‌ని చంపిన ఏ పోలీసు అధికారికైనా భారీ బహుమానం ఇస్తామని కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో సందేశంలో తెలిపారు. జైలు నుంచి బిష్ణోయ్ కార్యకలాపాలు కొనసాగుతుండటంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. గతేడాది జరిగిన కర్ణిసేన మాజీ చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గొగమేడి హత్యకు బిష్ణోయ్ కారణమని ఆరోపించారు. బిష్ణోయ్ లాంటి గ్యాంగ్‌స్టర్లు దేశవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టించారని షెకావత్ అన్నారు.