Kapil Sibal: అమెరికాను కాని, ట్రంప్ పేరు ఎందుకు ప్రస్తావించలేదు? : సిబల్

పాకిస్థాన్‌తో భారత్ సాగించిన యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జోక్యం చేసుకున్నా ప్రధాని మోదీ (Prime Minister Modi )తన ప్రసంగంలో అమెరికాను కాని, ట్రంప్‌ను కాని ఎందుకు ప్రస్తావించలేదని రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal) ప్రశ్నించారు.కాల్పుల విరమణపై కుదిరిన అవగాహన గురించి కూడా ప్రధాని వివరణ ఇవ్వలేదని తెలిపారు. మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని సిబల్ ప్రస్తావిస్తూ సాయుధ దళాల పరాక్రమాన్ని తాము కీర్తిస్తామని, పాకిస్థాన్ (Pakistan)కు దీటుగా జవాబిచ్చినందుకు దేశ ప్రజలంతా సాయధ దళాలకు జైకొడతారన్నారు. కాల్పుల విరమణకు తాము మధ్యవర్తిత్వం వహించామని ట్రంప్ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. భారత్, పాక్ మధ్య అణు యుద్ధాన్ని తాము ఆపామని, యుద్ధాన్ని ఆపితే పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తామని కూడా తాను రెండు దేశాలకు చెప్పానని ట్రంప్ ప్రకటించారని చెప్పారు. అమెరికా (America), ట్రంప్‌ను ప్రధాని ప్రస్తావించకపోవడాన్ని సిబల్ ప్రవ్నించారు.