Kambhampati hari babu: ఒడిశా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు
మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబు(Kambhampati hari babu) ను ఒడిశా (Odisha) గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీమంత్రి జనరల్ వీకే సింగ్ (VK Singh) మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరోచోటకు బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జనరల్ వీకే సింగ్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అందుకు బదులుగా ఇప్పుడు గవర్నర్ బాధ్యతలు కట్టబెట్టింది. మరోవైపు ప్రస్తుతం ఒడిశా గవర్నర్‌గా ఉన్న రఘుబర్‌దాస్ రాజీనామా చేశారు.






