Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్

మక్కల్ నీది మయ్యం (ఎమ్‌ఎన్‌ఎమ్) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (M.K. Stalin) , మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ (Uday Nidhi Stalin) హాజరయ్యారు. ఇటీవల తన చిత్రం థగ్ లైఫ్ (Thug Life) అవెంట్‌లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దాంతో బుధవారం వేయాల్సిన రాజ్యసభ (Rajya Sabha) నామినేషన్‌ను కమల్ వాయిదా సుకున్నారు. సినిమా వ్యవహరాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. థగ్ లైఫ్ చిత్రం విడుదలవడంతో నేడు నామినేషన్ దాఖలు చేశారు.