26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. ఎందుకో తెలుసా?

నవంబర్ 26న పార్లమెంటు ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయసభల సభ్యులు సమావేశమవుతారు. రాజ్యాంగానికి ఆమోదం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆర్టికల్స్, చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల గురించి విషయాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.