జియో వినియోగదారులకు శుభవార్త…

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్తను అందించింది. కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న యూజర్లకు రోజుకు 10 నిమిషాల అవుట్‍గోయింగ్ కాల్స్ ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉచిత టాక్‍టైం అందించడానికి జియో రిలయన్స్ ఫౌండేషన్‍తో కలిసి పనిచేస్తున్నది. దీంతో పాటు ప్రతి రీచార్జిపై అంతే స్థాయి కలిగిన రీచార్జిని ఉచితంగా అందిస్తున్నది. సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాలు లాక్‍డౌన్ ప్రకటించిన ప్రస్తుతం తరుణంలో ఇలా ఉచితంగా టాక్‍టైం ఆఫర్‍ను ప్రకటించిన తొలి సంస్థ జియో కావడం విశేషం.