జియోకు మరో 42 లక్షలు…

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఫిబ్రవరి నెలలో సంస్థ 42 లక్షల మంది వినియోగదారులు జియో నెట్‍వర్క్ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో 41.49 కోట్ల మంది వినియోగదారులతో తన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నది.