పోలింగ్‌కు సిద్ధమైన ఝార్ఖండ్!

అసెంబ్లీ ఎన్నికలకు ఆదివాసీ రాష్ట్రం ఝార్ఖండ్ సిద్ధమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా, మొదటి దశలో 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం సీట్లలో 28 ఎస్టీ, తొమ్మిది ఎస్సీ రిజర్వుడు స్థానాలే ఉన్నాయి. నవంబర్ 13న జరగనున్న తొలిదశ పోలింగ్ కోసం అధికార జేఎంఎం, బీజేపీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల అంశం ప్రధానంగా నిలువగా, అవినీతి, ప్రజాకర్షక హామీలు, కేంద్రం నిధుల విడుదల వంటివి కీలకాంశాలుగా నిలిచాయి.