J.D. Vance: భారత్‌కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(J.D. Vance) భారత్‌కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ (Delhi) లోని పాలెం టెక్నికల్ (Palem Technical) ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్(Usha Vance) కూడా వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్(India) పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వారిలో రక్షణ శాఖ, విదేశాంగశాఖ అధికారులు ఉన్నారు. వాన్స్‌కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి.