ప్రధాని మోదీతో సీఎం ఒమర్ భేటీ

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢల్లీిలో పర్యటించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం చేసిన తీర్మానం ప్రతిని ఆయనకు అందజేశారు. కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు సహా పలు సమస్యలపై మోదీతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి సంప్రదాయ కశ్మీరీ శాలువాను బహూకరించారు.