Siddhi Vinayaka Temple :ముంబయి సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న మస్క్ తల్లి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ (Maye Musk) ప్రస్తుతం భారత్ (India)లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)తో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని(Siddhi Vinayaka Temple) సందర్శించి పూజలు చేశారు. జాక్వెలిన్ మాయేతో కలిసి దేవున్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తాను రాసిన పుస్తకం ఉమెన్ మేక్స్ ఏ ప్లాన్ హిందీ ఎడిషన్‌ను ఆవిష్కరించడానికి మాయే ముంబయి (Mumbai) వచ్చినట్లు సమాచారం. ఇటీవల ఆమె తన 77వ పుట్టిన రోజు వేడుకలను ఇక్కడే జరుపుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిరచాయి. ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్ అనే పుస్తకంలో మాయే తన కుటుంబం ఎదుర్కొనన ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.