Mallikarjuna Kharge : ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం.. అధిష్ఠానం చేతిలోనే : మల్లికార్జున ఖర్గే

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరో మూడు నెలల్లో సీఎం పదవి (CM post) స్వీకరిస్తారంటూ పార్టీకి చెందిన పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge ) ను మాట్లాడుతూ ముఖ్యమంత్రి (Chief Minister) మార్పుపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం పార్టీ అధిష్ఠానంలో చేతిలోనే ఉంటుందని చెప్పడం గమనార్హం. అంతే కాకుండ హైకమాండ్ (High Command) లో ఏమీ జరుగుతుందో ఎవరికీ తెలియదని, వారి నిర్ణయాల గురించి ఎవరూ చెప్పలేరని అన్నారు. ఈ విషయంపై ఎవరూ అనవసర సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని కోరారు.