జార్ఖండ్ ఎన్నికల వేళ కీలక పరిణామం … సీఎం పీఏ ఇంట్లో
అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేఎమ్ఎమ్ నేత హేమంత్ సోరెన్ వ్యక్తిగత సలహాదారు సునీల్ శ్రీవాత్సన పై ఆదాయ పన్ను శాఖ టార్గెట్ చేసింది. రాంచీలోని అశోక్ నగర్లో గల ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. దాంతో పాటు రాంచీ, జంషెడ్‌పూర్‌లో దాదాపు తొమ్మిది చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సునీల్ శ్రీవాత్సవ కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. అయితే ఎంత మొత్తం పన్ను ఎగవేశారన్నది తెలియరాలేదు. ఈ కారణంగానే ఐటీ అధికారులు దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ తేలిసింది. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రా, అతని సహచరుల రహస్య స్థావరాలపై కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.50 లక్షల నగదు, కిలో బంగారు వెండి, 16 కాట్రిడ్జ్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది.






