Parag Jain: రా చీఫ్‌గా పరాగ్ జైన్

భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) తదుపరి చీఫ్‌గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ (Parag Jain) నియమితులయ్యారు. 1989 పంజాబ్ (Punjab) కేడర్‌కు చెందిన ఆయన జులై 1న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రా చీఫ్ రవి సిన్హా (Ravi Sinha) పదవీకాలం జూన్ 30న ముగియనుండడంతో తదుపరి అధిపతిగా పరాగ్ జైన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా విభాగంలో సూపర్ డిటెక్టివ్ (Super Detective) గా పేరున్న పరాగ్ జైన్ ఎన్నో కీలక ఆపరేషన్లకు నేతృత్వం వహించారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లోనూ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.