Intelligence: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవికాలం.. మరోసారి

ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ (Intelligence Bureau Chief) తపన్ కుమార్ డేకా (Tapan Kumar Deka) పదవీ కాలం మరోసారి పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది వరకు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులను సమర్థంగా పరిష్కరించిన తపన్ కుమార్ పదవీకాలం గతేడాది పొడిగించారు. తాజాగా మరోసారి పొడిగించారు. జూన్ 2026 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) కేడర్‌కు చెందిన డేకా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన గతంలో రెండు దశాబ్దాల పాటు ఐబీ ఆపరేషన్స్ (IB Operations) విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. 2008 ముంబయి (Mumbai) 26/11 ఉగ్రదాడి సమయంలో కౌంటర్ ఆపరేషన్‌కు బాధ్యత వహించారు.