Operation Sindoor: మా పోరాటం ఉగ్రవాదులపైనే … దానికి వారే బాధ్యులు

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor )లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదం (Terrorism), ఉగ్రవాదులపైనే తమ పోరు అని ఆపరేషన్ సిందూర్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడిరచారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ (Pakistan) పై దాడుల వీడియోను అధికారులు ప్రదర్శించారు. పాకిస్థాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలచుకున్నాయని పేర్కొన్నారు. దీంతో భారత సైన్యం దీటుగా జవాబు ఇచ్చిందని చెప్పారు. పాకిస్థాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాద్యులని స్పష్టం చేశారు. పాకిస్థాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రుదుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదన్నారు. అనంతరం పాక్‌లోని నూర్‌ఖాన్ (Nurkhan), రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు.