దసరా సందర్భంగా ఇన్ఫోసిస్ శుభవార్త.. ఉద్యోగులకు!
దసరా వేడుకల సందర్భంగా ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. సంస్థ గత ఆరు నెలలుగా జీతాల పెంపు ప్రకటన వాయిదా వేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఇన్ఫోసిస్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో నవంబర్ 1న ఉద్యోగుల వార్షిక వేతనాన్ని పెంచుతున్నట్లు కంపెనీ చీఫ్ హ్యూమస్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ తెలిపారు. ఇన్ఫోసిస్ సాధారణంగా శాలరీలను ఏప్రిల్ నెలలో సీనియర్ మేనేజ్మెంట్ కంటే తక్కువ ఉన్న ఉద్యోగులందరికీ వార్షిక పెంపును అమలు చేస్తుంది. మిగిలిన ఉద్యోగులకు జూలైలో అందిస్తుంది. అయితే ఐటీ విభాగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా చెల్లించే వేతనాలు, ఇతర బెన్ఫిట్స్ను వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇదే అంశంపై క్లారిటీ ఇవ్వడంతో సంస్థ తీసుకున్న నిర్ణయంపై లక్షల మంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






