ఫ్రెషర్ లకు ఇన్ఫోసిస్ షాక్
ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న ఫ్రెషర్లకు కంపెనీ షాక్ ఇచ్చింది. అసెస్మెంట్ పేరుతో ఇన్ఫోసిస్‌లో జరిగే అంతర్గత పరీక్షలో విఫలమమైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. పరీక్షలో ఫెయిల్ అయినందుకు ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీ వీరికి సమాచారం ఇచ్చింది. గత కొద్ది నెలల్లోనే సంస్థ 600 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. గత నెలలో ఎఫ్ఏ టెస్ట్‌లో ఉత్తీర్ణులు కాలేకపోయిన 280 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నెల మొదటివారంలో జరిగిన టెస్టుకు 150 మంది హాజరయ్యారు. వీరిలో 90 మంది ఉత్తీర్ణులు కాలేక, ఉద్యోగాలు కోల్పోయారు. 2022 జులై నాటి బ్యాచ్‌లో 85 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఈ కారణంతోనే తొలగించింది. తాము ఉద్యోగాలు కోల్పోవడానికి టెస్ట్‌లో పెయిల్ కారణం కాదని ఫ్రెషర్లు చెబుతున్నారు. సంస్థ ప్రతినిధులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. మరో వైపు ఇన్ఫోసిస్ సంస్థ ఆఫర్ లెటర్లు పొందిన అనేక మంది ఎనిమిది నెలలుగా సంస్థలో చేరేందుకు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.






