Nitin Gadkari: రెండేళ్లలో అమెరికాను తలపించేలా : నితిన్ గడ్కరీ

భారతీయ రహదారులు మరో రెండేళ్లలో అమెరికా (America)ను తలపిస్తాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. రోడ్ల మౌలిక సదుపాయాలు పెరుగుతున్నట్లు తెలిపారు. గత పదేళ్లు నుంచి రోడ్డు (Road), రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఖర్చులను పెంచుతున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఫేస్‌లిఫ్ట్ గురించి ప్రశ్నలు కాదు, ఎప్పుడో రోడ్డు, రవాణా వ్యవస్థ మారిందన్నారు. మీరు కేవలం న్యూస్ రీల్ చూశారని, అసలైన సినిమా స్టార్ కావాల్సి ఉందని, ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు (Projects) పురోగమన దిశలో ఉన్నాయని అన్నారు. మరో రెండేళ్లలో భారతీయ రోడ్ల వ్యవస్థ, అమెరికాకు సమానంగా ఉంటుందని తెలిపారు.