భారత వాయుసేన మరో అరుదైన ఫీట్

భారత వాయుసేన మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తూర్పు సెక్టార్‌లో ట్రాన్స్‌పోర్టు విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. సీ`130జే విమానం అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్‌లో దిగిందని వాయుసేవ వెల్లడించింది. ఈ ఎన్‌వీజీ సాంకేతికత సాయంతో తక్కువ వెలుగులో ఐఏఎఫ్ మరింత సమర్థతతో ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుపడుతుంది. ఒక క్లిప్‌లో ఎన్‌వీజీ సహాయంతో విమానం సజావుగా ల్యాండ్ కావడం కనిపించింది. ఎయిర్‌క్రాఫ్ట్ లోపలి నుంచి వ్యూ ఎలా ఉంటుందో మరో వీడియోలో పంచుకుంది. దేశ సౌర్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే ప్రక్రియలో భాగంగా మా సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నా అని ఈ సందర్భంగా ఐఏఎఫ్ తెలిపింది. అవి ఎన్‌వీజీ విజువల్స్ కావడంతో ఆ దృశ్యాలన్ని ఆకుపచ్చ రంగులో భిన్నంగా కనిపిస్తున్నాయి.